Chandrababu: పులివెందులలో బస్టాండ్ కట్టలేని వ్యక్తి.. మూడు రాజధానులు ఎలా కట్టగలడు: చంద్రబాబు

X
Chandrababu: కడప జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు. పులివెందులలో బస్టాండ్ కట్టలేని వాడు.. మూడు రాజధానులు ఎలా కట్టగలడని ప్రశ్నించారు. కడప DRS కల్యాణ మండపంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు.. పదవ తరగతి పరీక్షలు నిర్వహించడం చేతకాక.. నారాయణపై కేసులు పెట్టారంటూ మండిపడ్డారు. ఇక మీ కేసుల కోసం పోరాడే వ్యక్తికి రాజ్యసభ సీటు ఇచ్చారన్న చంద్రబాబు.. ఏపీలో నిజాయితీగా ఉన్న వ్యక్తి ఒక్కరూ లేరాఅంటూ ప్రశ్నించారు. ఇక అన్నమయ్య ప్రాజెక్టు వల్ల సర్వం కోల్పోయిన గ్రామంలో 3వందల ఇళ్లు కట్టించలేపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
