Chandrababu: రాష్ట్రంలో చేతకాని దద్దమ్మ ప్రభుత్వం ఉంది- చంద్రబాబు

Chandrababu: జగన్ పాలనలో అన్ని వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. బాదుడే బాదుడుకు విరుగుడు తెలుగుదేశం పార్టీయేనన్నారు. రాష్ట్రంలో చేతకాని దద్దమన్న ప్రభుత్వం ఉందన్నారు. దేశంలో ఏపీలోనే పెట్రోల్, డీజిల్‌కు ఎక్కువ ధర ఉందని.. టీడీపీ హయాంలో పెట్రోల్‌పై ఐదు రూపాయలు తగ్గించామని గుర్తు చేశారు. కోడి కత్తి, బాబాయ్ హత్య లాంటివి ఉన్నాయని.. దేశంలో ఎక్కడా లేనంతగా ఏపీలోనే బాదుతున్నారన్నారు.
ఐఏఎస్ అధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇక టెన్త్ పరీక్షల పేపర్ లీకేజీల వెనుక వైసీపీ హస్తం ఉందన్నారు. తాను యువతకు ఐటీ ఉద్యోగం ఇస్తే.. జగన్ ఐదు వేలు జీతంలో వాలంటీర్ ఉద్యోగం ఇచ్చాడంటూ నిప్పులు చెరిగారు. జగన్ పాలనలో ఎన్నో అరిష్టాలు ఉన్నాయని.. 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని మండిపడ్డారు. జగన్ అడిగిన ఒక్క ఛాన్స్... ఇక వైసీపీకి చివరి ఛాన్స్ అన్నారు.
యువతకు ఫిష్ మార్కెట్లు, మటన్ మార్ట్‌లలో ఉద్యోగాలు ఇస్తారా అని నిలదీశారు. రాష్ట్రంలో ఎక్కడ భూములు ఉన్నయో.. ఎక్కడ గనులు ఉన్నాయో తెలుసుకోవడానికే పాదయాత్ర చేశారన్నారు. A1, A2లు కలిసి విశాఖను కబ్జా చేస్తున్నారని దుయ్యబట్టారు. వైజాగ్‌కు రాజధాని కాదు.. అభివృద్ధి కావాలన్నారు. ప్రజా వేదికతో రాష్ట్రంలో విధ్వంసం మొదలు పెట్టారని నిప్పులు చెరిగారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com