Chandrababu: చేతకాని వాళ్లే కులం, మతం, ప్రాంతాలపై మాట్లాడతారు: చంద్రబాబు

Chandrababu (tv5news.in)
Chandrababu: చేతకాని వాళ్లే కులం, మతం, ప్రాంతాలపై మాట్లాడతారన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. సమర్థులెప్పుడూ అభివృద్ధి గురించే ఆలోచిస్తారన్నారు. మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో ఐ-టీడీపీ టీమ్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు. సోషల్ మీడియాలో పార్టీ ప్రచారం, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటంలో ఐ-టీడీపీ టీమ్‌కు దిశానిర్దేశం చేశారు.
దేశంలోనే గొప్ప సిటీగా రూపొందించాలనుకున్న అమరావతిని జగన్ నాశనం చేశారన్నారు చంద్రబాబు. బాబాయ్‌ని చంపి తమపై అవాస్తవాలు ప్రచారం చేస్తారా అని జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. వివేకాను గొడ్డలిపోటుతో చంపి, గుండెపోటు అని డ్రామాలాడారని ఫైరయ్యారు. 40 కోట్ల సుపారీ ఎవరి రక్త చరిత్ర అని ప్రశ్నించారు.
సిగ్గులేకుండా సీబీఐపైనే ఎదురు దాడి చేస్తున్నారన్నారని మండిపడ్డారు చంద్రబాబు. అమరావతి ఉద్యమం కురుక్షేత్రాన్ని తలపించిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఎన్ని అరాచకాలు చేసినా.. చివరికి న్యాయమే గెలిచిందన్నారు. తెలుగు రైతుసభ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతులు చేసే ప్రతి పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందన్నారు చంద్రబాబు.
మోటార్లకు మీటర్లు పెట్టకుండా జగన్‌రెడ్డిని రైతాంగం అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. అధికారం నుంచి పోయేలోగా అంతా నాశనం చేస్తానంటే చూస్తూ ఉూరుకుంటామా అని ప్రశ్నించారు. నిజాల వెలికితీతలో కార్యకర్తలు ముందుండాలని సూచించారు చంద్రబాబు. అవాస్తవాలు, తప్పుడు ప్రచారాలు నమ్మి జగన్‌ని గెలిపించారని.. వాస్తవాలు ప్రజల ముందుంచి వైసీపీ అడ్రస్సు లేకుండా చేయాలని పిలుపునిచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com