Chandrababu: ప్రభుత్వ వైఫల్యాలపై న్యాయ విచారణ జరపాలి : చంద్రబాబు

Chandrababu (tv5news.in)
Chandrababu: గత ఏడాది పాడైన ప్రాజెక్టుకు గ్రీజు పెట్టలేని ముఖ్యమంత్రి... మూడు రాజధానులు కడతారా అంటూ ధ్వజమెత్తారు టీడీపీ అధినేత చంద్రబాబు. అసలు సీఎం జగన్‌కు బాధ్యత ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకుని పాలన చేస్తున్నారని ఆరోపించారు. వరదలతో కుటుంబాలు రోడ్డుపడ్డా... జగన్‌కు పట్టడంలేదన్నారు.
ఓటీఎస్‌తో ఈ ప్రభుత్వానికి ఏం సంబంధమని ప్రశ్నించారు చంద్రబాబు. సీఎం జగన్ అహంకారం పరాకాష్టకు చేరిందన్నారు. ఓటీఎస్ విధానంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని... బాధితులకు టీడీపీ అండగా ఉంటుందన్నారు. ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంటుందని మండిపడ్డారు.
ఇక వరద బీభత్సానికి కారణం వైసీపీ సర్కార్ తప్పిదమేనన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. సీఎం జగన్ వైఫల్యం వల్లే ప్రాణనష్టం జరిగిందన్నారు. తమకు ముందస్తు హెచ్చరికలు లేవని బాధితులు చెబుతున్నారని అన్నారు. ఒకే కుటుంబంలో తొమ్మిది మంది కొట్టుకుపోయి.. చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి బాధ్యతలకు అతీతుడు కాదని.. ఈ ప్రభుత్వంలో జవాబుదారీతనం లేదన్నారు. బాధ్యతలకు వెనుకాడితే సీఎంగా ఉండే అర్హత లేదని మండిపడ్డారు చంద్రబాబు. తెలిసో.. తెలియకో... ఓట్లు వేసిన పాపానికి ప్రజల ప్రాణాలు తీస్తారా అంటూ జగన్ సర్కార్‌ను నిలదీశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com