Chandrababu: జనం తిరగబడితే జగన్‌ బయట తిరగలేరు: చంద్రబాబు

Chandrababu: జనం తిరగబడితే జగన్‌ బయట తిరగలేరు: చంద్రబాబు
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన ముగిసింది..

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన ముగిసింది.. రెండు రోజులు కుప్పం అట్టుడికిపోగా మూడోరోజూ దాదాపు అదే సిచ్యుయేషన్‌ కనిపించింది.. మూడో రోజు కుప్పం, గుడుపల్లి మండలాల్లో పర్యటించారు. ఉదయం కుప్పం ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌస్‌లో స్థానిక ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం మోడల్ పర్యటించారు.. ఆ తరువాత కృష్ణదాసపల్లి, జరుగు, గుడ్లనాయనపల్లి గ్రామాల్లో సమావేశాలు నిర్వహించారు.

రాష్ట్రంలో జగన్‌ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కుప్పం నియోజకవర్గంపై జగన్‌ కక్ష గట్టారని.. అన్నక్యాంటీన్‌పై దాడికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. యానాదిపల్లెలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.. వైసీపీ తుమ్మితే ఊడే ముక్కని.. ఎవరూ భయపడాల్సిన పనిలేదని చంద్రబాబు అన్నారు.

జనం తిరగబడితే జగన్‌ బయట తిరగలేరన్నారు. నార్త్‌ కొరియాలో కిమ్‌ ఉన్నట్లే మనకూ ఇక్కడ జగన్‌ ఉన్నాడని.. మనపై దాడి చేసి మనపైనే కేసులు పెడుతున్నాడని మండిపడ్డారు. అన్నం పెడుతుంటే దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. అనంతరం కుప్పం నియోజవర్గంలో ఆగిపోయిన హంద్రీనీవా పనులను చంద్రబాబు పరిశీలించారు.

కోట్లాది రూపాయలు ఖర్చుబెట్టి టీడీపీ హయాంలో కుప్పానికి.. హంద్రీనీవా కాలువ పనులు తీసుకొస్తే ఆగిపోయిన కొద్ది శాతం పనులను పూర్తి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హింద్రీనీవా నీళ్లు వస్తే టీడీపీకి ఎక్కడ మంచి పేరు వస్తుందేమో అన్న కక్షతో.. జగన్‌మోహన్‌ రెడ్డి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు ఎందుకు ఆపారో జగన్‌ మోహన్‌ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. ఇక గురువారం జరిగిన ఘటనపై పోలీసుల మీద ప్రైవేట్‌ కేసులు వేస్తామని చంద్రబాబు చెప్పారు.

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని.. యనమనాసనపల్లిలో టీడీపీ రచ్చబండ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు సంక్షంలో 20 కుటుంబాలు, నలుగురు వైసీపీ వార్డు మెంబర్లు పార్టీలో చేరారు. అనంతరం చంద్రబాబు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రీపెయిడ్‌ మీటర్లు అమరిస్తే రైతులకు ఉరితాడు బిగిసినట్టే అవుతుందని చంద్రబాబు అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story