Chandrababu: పవన్ కళ్యాణ్‌తో పొత్తుపై లవ్ స్టోరీ చెప్పిన చంద్రబాబు..

Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత కుప్పం పర్యటనలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తానే ముఖ్యమంత్రినన్నారు చంద్రబాబు. జమిలి ఎన్నికలైనా, ఏ ఎన్నికలైనా టీడీపీ విజయం తథ్యమన్నారు. టీడీపీ ప్రభంజనాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు చంద్రబాబు. రామకుప్పం మండలం నారాయణపురంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇక వచ్చే ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి చంద్రబాబు చేసిన కామెంట్స్ కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. రామకుప్పం మండలం వీర్నమల తండాలో ఓ కార్యకర్త..చంద్రబాబుతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కూడా కలుపుకుపోవాలని చంద్రబాబును కోరారు. దీనిపై స్పందించిన చంద్రబాబు.. లవ్ ఎప్పుడూ రెండు వైపులా ఉండాలని, ఏకపక్షంగా లవ్ చేయడం కరెక్ట్ కాదంటూ చమత్కరించారు. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com