Chandrababu Naidu : సీఎం జగన్ జూనియర్ కిమ్‌లా మారారు : చంద్రబాబు

Chandrababu Naidu : ఓటీఎస్ పేరుతో పేదల మెడలకు ఉరితాళ్లు బిగిస్తున్నారని విమర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు. అమరావతిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో.. పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో.. వైసీపీ నేత సుబ్బారావుగుప్తాపై దాడి విషయాన్ని నేతలు ప్రస్తావించగా.. రాష్ట్రంలో అచారక పాలన రాజ్యామేలుతోందని, ప్రశ్నించినవారిపై దాడులు చేయడం హేయమని చంద్రబాబు ఖండించారు. సీఎం జగన్ జూనియర్ కిమ్‌లా మారారన్న చంద్రబాబు.. ఓటీఎస్ పేరుతో ప్రజల్ని ఇబ్బంది పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారని అన్నారు. విశాఖ రామానంద ఆశ్రమంలో గోవులు చనిపోవడంపై విచారం వ్యక్తం చేసిన బాబు.. పశువులకు గడ్డి పెట్టలేని జగన్.. మూడు రాజధానులు కడతారా.? అని ప్రశ్నించారు. జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసును కుట్రపూరితంగానే దారి మళ్లిస్తున్నారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com