CBN: జగన్ కుట్రలకు అద్దం పట్టిన రాజధాని ఫైల్స్

ముఖ్యమంత్రి జగన్ కు అసలు సినిమా ఇప్పుడు మొదలవుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ఇప్పటి వరకు జగన్ నడిపించిన సినిమా అయిపోయిందని ఆయన చెప్పారు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ఒక ప్రాంతంపై కక్షగట్టి అదీ ఆంధ్రప్రదేశ్ రాజధానిపై పగబట్టి సర్వనాశనం చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఇది ఓ చారిత్రాత్మక విషాదమని పేర్కొన్నారు. అధికార బలం మొత్తాన్ని ఉపయోగించి ఉద్యమకారులను చిత్రహింసలకు గురిచేశారని చంద్రబాబు మండిపడ్డారు.ఈ కుట్రలకు, దారుణాలకు అద్దం పట్టిన రాజధాని ఫైల్స్' సినిమా జగన్ క్రూరత్వానికి, వైసీపీ విధ్వంసానికి నాశనమైన ఒక రాజధాని, దాని కోసం ఎన్నో త్యాగాలు చేసిన ప్రజల కష్టాలను కళ్ళకు కట్టిందని తెలిపారు. అందుకే ఈ సినిమా విడుదలను ఆపడానికి....... జగన్ శతవిధాల ప్రయత్నించారని ఆక్షేపించారు. ఈ ఆటలు సాగలేదని, హైకోర్టు చిత్ర ప్రదర్శనకు.. అనుమతి ఇచ్చిందని చెప్పారు. తెలుగు ప్రజలంతా.... థియేటర్లలో రాజధాని ఫైల్స్ సినిమా చూసి.. వాస్తవాలను తెలుసుకోవాలని చంద్రబాబు కోరారు.
అంతకుముందు రాజధాని ఫైల్స్ ' సినిమా విడుదలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రివైజింగ్ కమిటీ ధ్రువపత్రాలన్నీ పరిశీలించాకే సెన్సార్ బోర్డు సర్టిఫికెట్లు ఇచ్చిందని కోర్టు అభిప్రాయపడింది. సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ ఇచ్చిన ధ్రువపత్రాలను హైకోర్టు పరిశీలించింది. నిబంధనల మేరకే ధ్రువపత్రాలు జారీచేశారని అభిప్రాయపడింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించిన కోర్టు తదుపరి విచారణను వాయిదావేసింది.
అసలేం జరిగిందంటే..
రాజధాని ఫైల్స్ సినిమా విడుదలను నిలిపివేస్తూ... ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది.రాజధాని ఫైల్స్ సినిమాపై వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు...... ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని ఫైల్స్ సినిమాలో.... సీఎం జగన్, కొడాలి నానిని పోలిన పాత్రలు ఉన్నాయని... వారిని కించపరిచే విధంగా చిత్రీకరించారని పిటీషనర్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం.... శనివారం వరకు సినిమా విడుదలను నిలుపుదల చేసింది. సినిమా రికార్డ్స్‌ను... తమ ముందు ఉంచాలని ఆదేశించింది . హైకోర్టు ఆదేశాలు జారీచేసిన వెంటనే ఆర్డర్ కాపీ రాకముందే జగన్ సర్కారు ఆగమేఘాలపై.... అధికారులను రంగంలోకి దించి.... సినిమా ప్రదర్శన నిలిపివేయించింది. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సినిమా ప్రదర్శిస్తోన్న థియేటర్లకు వెళ్లి ప్రదర్శనను అర్ధాంతరంగా ఆపేశారు. డబ్బు చెల్లించి టికెట్లు కొన్నందున సినిమా పూర్తిగా చూసేందుకు.... అవకాశం ఇవ్వాలని ప్రేక్షకులు కోరినా పట్టించుకోలేదు. హైకోర్టు స్టేఆర్డర్ కాపీ చూపించాలని కొందరు ప్రేక్షకులు నిలదీయగా.. వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం విచారణ జరిపిన అనంతరం సినిమా ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com