HC: చంద్రబాబుకు భారీ ఊరట

HC: చంద్రబాబుకు భారీ ఊరట
ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, మద్యం, ఉచిత ఇసుక కేసుల్లో ముందస్తు బెయిల్‌.... దర్యాప్తు అధికారుల తీరునూ తప్పుపట్టిన హైకోర్టు

ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, మద్యం, ఉచిత ఇసుక కేసుల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా..... హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మద్యం కేసు సందర్భంగా మద్యం దుకాణాల యజమానులతో పిటిషనర్లు కుమ్మక్కయ్యే ప్రశ్నేరాదనీ ఎన్నికైన ప్రభుత్వానికి తన సొంత విధానాన్ని అనుసరించే అధికారం ఉంటుందని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ఆ విధానంలో అక్రమాలు లేనంతవరకూ.. విధాన రూపకర్తలకు దురుద్దేశాలను ఆపాదించడానికి వీల్లేదనీ చెప్పారు. బార్లకు ప్రివిలేజ్‌ రుసుం తొలగింపునకు ఆర్థికశాఖ ఆమోదం పొందకపోవడాన్ని అప్పటిమంత్రి, ముఖ్యమంత్రికి ఆపాదించడానికి వీల్లేదని అభిప్రాయపడుతున్నామని న్యాయమూర్తి తెలిపారు. విధివిధానాలను మంత్రులు, ముఖ్యమంత్రికి.... వివరించాల్సిన బాధ్యత అధికారులదేనన్న పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనతో ఏకీభవిస్తున్నట్టు చెప్పారు. లాటరీ విధానంలో మద్యం దుకాణాలను ఎంపిక చేస్తున్నందున.. భవిష్యత్తులో ఎంపికయ్యే మద్యం దుకాణాల యజమానులతో పిటిషనర్లు కుమ్మక్కయ్యే ప్రశ్నేతలెత్తదని న్యాయమూర్తి చెప్పారు.


కేసు దస్త్రాలన్నీ ప్రభుత్వం వద్ద ఉన్నందున్న పిటిషనర్లకు ముందస్తు బెయిలు మంజూరు చేస్తే దర్యాప్తునకు అవరోధం జరగదని న్యాయమూర్తి తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు-IRR కేసు దర్యాప్తులో భాగంగా చంద్రబాబు అరెస్టు కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ కేసులో పేర్కొన్న లావాదేవీలన్నీ 2014 నుంచి 2019 మధ్య జరిగాయని.. అవన్నీ రికార్డుల్లో ఉన్నాయని చెప్పింది. ఈ కేసులో ప్రాథమిక సాక్ష్యాలన్నీ రికార్డులే అయినప్పుడు చంద్రబాబును అరెస్టు చేయాల్సిన పనిలేదని తెలిపింది. 2022 సెప్టెంబరు 5న FIR నమోదైతే 2023 సెప్టెంబరు వరకు దర్యాప్తునకు హాజరు కావాలనిగానీ అవసరమైన సమాచారం, పత్రాలు అందజేయాలని చంద్రబాబును CID కోరలేదని కోర్టు పేర్కొంది. చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలన్న CID విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. తీర్పు సందర్భంగా దర్యాప్తు సంస్థకు కోర్టు చురకలు అంటించింది.ఒక వ్యక్తి తప్పుచేశారని అభియోగాలు మోపి అరెస్ట్‌ చేయడం సరికాదనీ కొంత దర్యాప్తు తర్వాత సంతృప్తికర సమాచారం వస్తేనే అరెస్టు చేయడం తెలివైన నిర్ణయమని పేర్కొంది.ఉచిత ఇసుక విధానం పేద కుటుంబాల నిర్మాణ అవసరాల కోసం ఉద్దేశించిందని క్యాబినెట్‌ నిర్ణయం, జీవోలు,మెమోలను పరిశీలిస్తే కొందరి ప్రయోజనం కోసం పథకం తెచ్చినట్లు కనిపించట్లేదని హైకోర్టు పేర్కొంది. ఇసుక రీచ్‌లను అధికారపార్టీ నేతలు పంచుకున్నారన్న ఆరోపణతప్ప..ఈ పాలసీ ద్వారా ఫలానావ్యక్తులు ప్రయోజనం పొందారని ఆధారాలు చూపడంలో సీఐడీ విఫలమైందనిచంద్రబాబుకు ముందస్తు బెయిలు మంజూరుచేసిన ఉత్తర్వుల్లో హైకోర్టు పేర్కొంది.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు అరెస్టు, కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఫిర్యాదులో పేర్కొన్న లావాదేవీలన్నీ 2014 నుంచి 2019 మధ్య జరిగాయని అవన్నీ రికార్డుల్లో ఉన్నాయని తెలిపింది. ప్రాథమిక సాక్ష్యాలు అవే అయినప్పుడు చంద్రబాబును అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. ఒక వ్యక్తి తప్పుచేశారన్న అభియోగాలు మోపి అరెస్టు చేయడం సరికాదంటూ దర్యాప్తు సంస్థలకూ కోర్టు చురకలు అంటించింది. కస్టడీకి ఇవ్వాలన్న సీఐడీ విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ జస్టిస్ T.మల్లికార్జున రావు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story