CM Chandrababu Naidu : టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మళ్లీ చంద్రబాబు.. ప్రస్థానం ఇదే

CM Chandrababu Naidu : టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మళ్లీ చంద్రబాబు.. ప్రస్థానం ఇదే
X

టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కడప వేదికగా జరుగుతున్న మహానాడులో చంద్రబాబు అరుదైన రికార్డు సాధించారు. టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ఇప్పటికే 30 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. తాజాగా కడపలో జరుగుతున్న మహానాడులో పార్టీ నియమావళికి అనుగుణంగా అధ్యక్ష పదవికి మంగళవారం చంద్రబాబు నాయుడు నామినేషన్ దాఖలు చేశారు. చంద్రబాబు ఒక్కరే నామినేషన్ వేయడంతో ఎన్నిక ఫలితం లాంఛనంగా మిగిలింది. బుధవారం ఎన్నిక ఫలితాన్ని ఎన్నికల అధికారి వర్ల రామయ్య మహానాడు వేదికగా ప్రకటించారు. చంద్రబాబు నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటన చేశారు. అనంతరం ఎన్నిక ధ్రువపత్రాన్ని చంద్రబాబుకు అందజేశారు. అనంతరం చంద్రబాబు నాయుడు జాతీయ అధ్య క్షుడిగా పదవీ ప్రమాణం చేశారు. జాతీయ అధ్యక్షుడు ఎన్నికైన చంద్రబాబుకు నేతలు అభినందనలు తెలిపారు.

తొలిసారిగా 1995లో తెదేపా అధ్యక్ష పదవి చేపట్టారు. సుదీర్ఘ కాలంగా ఆ హోదాలో కొనసాగుతున్నారు. ఈ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు, కష్టాలు ఎదుర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004, 2009లో తెదేపా పార్టీ అధికారానికి దూరమైంది. ఇక 2014లో రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన విషయం తెలిసిందే. చంద్రబాబు మీద నమ్మకంతో నవ్యాంధ్ర ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. 2014 నుంచి 2019 వరకు సీఎం చంద్రబాబు పరిపాలించారు. 2019లో టీడీపీ మరోసారి అధికారానికి దూరమైంది.ఆ తర్వాత పార్టీ అనేక సంక్షోభాలను చవిచూసింది. చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం జైలుకు పం పింది. ఆ క్రమంలో 53 రోజుల జైలు జీవితం అనంతరం బయటకొచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి 2024 ఎన్ని కల్లో చరిత్రను తిరగరాసే విజయాన్ని సాధించి వైసీపీని మట్టికరిపించారు.

Tags

Next Story