పంచాయితీ ఎన్నికల్లో వైసీపీకి ముకుతాడు వేయాలి : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలుగు తమ్ముళ్లకు కీలక సూచనలు చేశారు. గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యానికి ఈ పంచాయితీ ఎన్నికలు నాంది కావాలన్నారు.
పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ రౌడీరాజ్యానికి ముకుతాడు వేయాలన్నారు. వైసీపీ పతనానికి పంచాయితీ ఎన్నికలే నాంది కావాలన్నారు. అన్ని పంచాయితీలలో అభ్యర్ధులు పోటీలో ఉండాలని, బలవంతపు ఏకగ్రీవాలు జరగకుండా చూడాలన్నారు.
పంచాయితీ ఎన్నికల కోడ్ అమల్లోకి ఉందని, వైసీపీ నేతల దౌర్జన్యాలను మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసి అధికారులకు, టీడీపీ కేంద్ర కార్యాలయానికి పంపాలని కోరారు. వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే ఓడిపోతామనేదే వైసీపీ భయమన్నారు. ఏపీని అన్నివిధాలా నాశనం చేయడానికి జగన్ కంకణం కట్టుకున్నారని వీడియో కాన్ఫరెన్స్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com