AP : ఎల్లుండి ఢిల్లీకి చంద్రబాబు.. నిధులపై లాబీయింగ్

ఏపీ సీఎం చంద్రబాబు ( N. Chandrababu Naidu ) ఢిల్లీ పర్యటన ఖరారైంది. 4న ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో పాటు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ కానున్నారు. విభజన హామీలతో పాటు మరిన్ని ఆర్థిక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. కేంద్ర బడ్జెట్ దృష్ట్యా రాష్ట్రానికి సంబంధించిన ప్రతిపాదనలపై కూడా సుదీర్ఘంగా చర్చించవచ్చు.
కేంద్రం ఆమోదించే బడ్జెట్లో ఏపీకి నిధులు గతంకంటే అధికంగా కేటాయించాలని కోరనున్నారు. ఈ భేటీ తరువాత కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలపై ఒక స్పష్టత వస్తే రాష్ట్ర బడ్జెట్ పై ముందుకు వెళ్లాలనే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నట్లు కనపడుతోంది. ఆయన పర్యటపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇటీవల ఎన్డీయే కూటమిలో భాగస్వామ్యమైన బీహార్ సీఎం నితీష్ కుమార్ తమ
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
అదే విధంగా ఏపీ సీఎం ఢిల్లీ పర్యటన చేపట్టనున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ కు కూడా ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై చర్చిస్తారా లేదా అని కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com