CM Chandrababu : నా కాళ్లకు దండం పెడితే నేనూ పెడతా: చంద్రబాబు

CM Chandrababu : నా కాళ్లకు దండం పెడితే నేనూ పెడతా: చంద్రబాబు
X

కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వీడాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తల్లిదండ్రులు, భగవంతుడి కాళ్లకు దండం పెట్టాలి తప్ప నాయకులకు కాదన్నారు. ఇకపై ఎవరైనా తన కాళ్లకు నమస్కరిస్తే.. వారి కాళ్లకు తాను దండం పెడతానని చెప్పారు. నాయకుల కాళ్లకు దండం పెట్టి ఎవరూ తమ గౌరవాన్ని తగ్గించుకోవద్దని సూచించారు. ఇవాళ్టి నుంచి ఈ విధానానికి స్వస్తి పలుకుతున్నట్లు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. గోకుల క్షేత్రంలో నిర్మిస్తున్న వెంకటేశ్వరస్వామి గర్భాలయంలో ఆలయంలో నిర్వహించిన అనంత శేష స్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు అక్కడికి చేరుకున్న చంద్రబాబుకు ఆలయ నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ సైతం పాల్గొన్నారు. అక్షయ పాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు మధుపండిత్‌, మంత్రులు నారాయణ, సవిత, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు.

Tags

Next Story