Chandrababu: ఓటు విలువపై చంద్రబాబు ట్వీట్.. వీడియో వైరల్..

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ఓటు విలువ గురించి ఓ పెద్దావిడ చెప్పిన మాటలు అందరినీ ఆలోచింపచేస్తోంది. ఆ వీడియోను చంద్రబాబు తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఓటు విలువ గురించి పెద్దావిడ చెప్పింది విన్నాక ప్రతిఒక్కరికి ఈ సందేశాన్ని పంపాలనిపించిందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. పెద్దావిడకు ప్రత్యేక అభినందనలు తెలిపిన చంద్రబాబు.. మీ వంటి అభ్యుదయ భావాలు కలిగిన మహిళ టీడీపీ అభిమాని అయినందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు.
ఓటు విలువ గురించి ఈ పెద్దావిడ చెప్పింది విన్నాక, సమాజంలో ప్రతి ఒక్కరికీ ఆమె ద్వారా ఈ సందేశాన్ని అందజేయాలని అనిపించింది. అమ్మా! నీవంటి అభ్యుదయ ఆలోచనలు కలిగిన మహిళ, తెలుగుదేశం పార్టీ అభిమాని అయినందుకు, పార్టీ అధ్యక్షుడిగా నాకెంతో గర్వంగా ఉంది. మీకు అభినందనలు. pic.twitter.com/ZuYjwn2akE
— N Chandrababu Naidu (@ncbn) February 14, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com