Chandrababu: వరద బాధితులను ఆదుకోవడంలో జగన్ సర్కారు విఫలం: చంద్రబాబు

X
Chandrababu: ఏపీ ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడం వల్లే.. తెలంగాణలో కలపాలని విలీన గ్రామాల ప్రజల డిమాండ్ చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్‌లో అన్నారు. 14 రోజులుగా కరెంట్, తాగు నీరు లేక వరద బాధిత ప్రజలు నరకం చూస్తున్నారన్న ఆయన.. వరద బురదను, కూలిన చెట్లను తొలగించి రోడ్ల పై రాకపోకలు పునరుద్ధరించడం కోసం ప్రభుత్వం నుంచి కనీస ప్రయత్నం కూడా జరగడం లేదని ఆయన మండిపడ్డారు.
వారం క్రితమే వరదలు తగ్గాయి అని ప్రకటనలు చేసిన మంత్రుల.. ఇప్పటికీ విద్యుత్, రవాణాను ఎందుకు పునరుద్దరించ లేకపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ సర్కారు నుంచి వరద బాధితులకు కనీస సాయం అందకపోవడం వల్లనే ఎటపాక మండలం ప్రజలు తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
