AP : పాస్టర్ మృతిపై చంద్రబాబు విచారం.. విచారణకు ఆదేశం

పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతిపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఈ కేసులో అన్ని కోణాల్లోనూ విచారణ జరపాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పీఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో ప్రవీణ్ కన్నుమూశారు. అది హత్యేనని, ప్రభుత్వం దర్యాప్తు చేయించాలని క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తుండటంతో సీఎం స్పందించారు. ప్రత్యేక బృందాలు కేసును దర్యాప్తు చేయనున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధిపై కలెక్టర్లు దృష్టి సారించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రానికి తీర ప్రాంతం ఎక్కువగా ఉండటంతో అభివృద్ధికి ఛాన్స్ ఉందని చెప్పారు. కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు. ‘ఉమ్మడి జిల్లాల్లోని ఆఫీసర్లతో సంబంధం లేకుండా కొత్త జిల్లాల్లోని అధికారులను స్వేచ్ఛగా పని చేయనివ్వాలి. ఇందుకు సంబంధించి 2 రోజుల్లోనే ఆదేశాలు జారీ చేయాలి. సిబ్బంది కొరత ఉండకూడదు’ అని వ్యాఖ్యానించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com