Chandrababu: ఎన్ని ఆటుపోట్లు వచ్చినా టీడీపీ తట్టుకొని నిలబడింది: చంద్రబాబు

Chandrababu: తెలుగు వారి ఆత్మగౌరవం నినాదంతో టీడీపీ పుట్టిందన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు. టీడీపీ 40వ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా వివిధ దేశాల్లో స్థిరపడిన టీడీపీ అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ ఆశయాలు, ఆలోచనలకు అనుగుణంగా పార్టీ మరింత బలోపేతం కానుందన్నారు. పార్టీ స్థాపించిన ముహూర్త బలం గొప్పదని.. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా తట్టుకొని నిలబడిందన్నారు. ఎంతమంది పార్టీని ఇబ్బందుల్లో పెట్టాలని ప్రయత్నించినా రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తుందన్నారు.
ఎవరు ఏ దేశంలో ఉన్నా రాష్ట్ర భవిష్యత్‌కు NRIలు సహకరించాలని కోరారు. సంక్షేమానికి ఆద్యుడు ఎన్టీఆర్ అన్నారు. తెలుగు చరిత్ర చదవాలంటే టీడీపీ ఆవిర్భావానికి ముందు.. ఆవిర్భావం తర్వాత అని చదవాల్సిందేనన్నారు. పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు వంటి సంస్కరణలు ఎన్టీఆర్ తెచ్చారన్నారు చంద్రబాబు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న ఫుడ్ సెక్యూరిటీ విధానాన్ని 2 రూపాయలకే కిలో బియ్యం పథకంతో ఎన్టీఆర్ ఎప్పుడో అమల్లో పెట్టారన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com