Chandrababu: వెంటనే అమరావతి నిర్మాణం చేపట్టాలి: చంద్రబాబు డిమాండ్

Chandrababu (tv5news.in)
Chandrababu: వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా 3 రాజధానుల మోసాన్ని కట్టిపెట్టి.. అమరావతిని అభివృద్ధి చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇవాళ టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న పొలిట్‌బ్యూరో సమావేశంలో హైకోర్టు తీర్పు అంశం చర్చకు వచ్చింది. YCP సర్కార్ ఇప్పటికైనా 'ఒక రాష్ట్రం -ఒకే రాజధాని' అని ప్రకటించాలని, వెంటనే అమరావతి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ మీటింగ్‌లో తీర్మానం కూడా చేశారు. 3 రాజధానుల పేరుతో సీఎం ఇతర ప్రాంతాల ప్రజల్ని మోసం చేశారని పలువురు నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
అటు, సభ్యత్వ నమోదు కార్యక్రమం వివరాలను పొలిట్‌బ్యూరోకి వివరించారు నారా లోకేష్. ఇప్పటి వరకు టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు ఇన్స్యూరెన్స్ ద్వారా 100 కోట్ల సాయం అందించినట్లు వివరించారు. ఇక అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలా వద్దా అనేదానిపై ఇవాళ నిర్ణయం తీసుకోనున్నారు. మహానాడు, NTR శతజయంతి, సభ్యత్వ నమోదు.. తెలుగుదేశం 40వ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమాలపై చర్చ ప్రజా సమస్యలపై పోరాటం, భవిష్యత్ కార్యాచరణపైనా సమీక్ష
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com