Chandrababu: ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారు: చంద్రబాబు

Chandrababu: ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారు: చంద్రబాబు
X
Chandrababu: రాష్ట్రంలో ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారంటూ ట్వీట్‌ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు.

Chandrababu: రాష్ట్రంలో ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారంటూ ట్వీట్‌ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. జిల్లా పర్యటనలో వచ్చిన ప్రజాస్పందన అద్భుతమంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. మూడ్రోజుల జిల్లా పర్యటన ఎంతో అద్భుతంగా జరిగిందని, 7 జిల్లాల్లో 21 నియోజకవర్గాల్లో లక్షలమందికి చేరువగా పర్యటన సాగిందన్నారు. ప్రజాసమస్యలు, ప్రభుత్వ బాదుడే బాదుడిపై ప్రజల అభిప్రాయాలు, ,ఆవేదన, ఆగ్రహం ప్రభుత్వ వ్యతిరేకతను చాటాయన్నారు.

ప్రతి ఇంట్లోనూ, ప్రతి గ్రామంలోనూ ప్రజలు మార్పు కోరుకుంటున్న తీరు స్పష్టంగా కనిపించిందన్నారు చంద్రబాబు. తెలుగు తమ్ముళ్లలో కసి, ప్రజల్లో టీడీపీపై ఆసక్తి.. రాబోయే మార్పును సూచిస్తున్నాయన్నారు. వాడవాడలా వెల్లువలా కదిలి, అర్థరాత్రి సైతం ఎదురేగి స్వాగతం పలికిన కార్యకర్తలు, ప్రజలకు ధన్యవాదాలంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ పర్యటనకు వచ్చిన ప్రజా స్పందన రాష్ట్రానికే ఒక సందేశం ఇచ్చిందన్నారు చంద్రబాబు.

Tags

Next Story