Chandrababu: టెన్త్ ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్‌..

Chandrababu: టెన్త్ ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్‌..
Chandrababu: టెన్త్‌ ఫలితాల్లో 2 లక్షలమంది విద్యార్ధులు ఫెయిల్‌‌కు జగన్‌ సర్కారు కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు

Chandrababu: టెన్త్‌ ఫలితాల్లో 2 లక్షలమంది విద్యార్ధులు ఫెయిల్‌ కావడానికి జగన్‌ సర్కారు కారణమంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ మేరకు ట్వీట్‌ చేశారాయన. సీఎం జగన్‌ చెప్పిన నాడు - నేడు అంటే.. 2 లక్షల మంది విద్యార్ధులు ఫెయిల్‌ అవ్వడమేనా? అని ప్రశ్నించారు. వ్యవస్థలో లోపాలకు స్టూడెంట్స్‌ ప్రాణాలు తీసుకోవద్దన్నారు చంద్రబాబు. నాడు-నేడు అంటూ మూడేళ్లుగా ప్రభుత్వం చేసిన.. ఆర్భాటపు ప్రచారానికి, పదోతరగతి ఫలితాలకు పొంతనే లేదని ఎద్దేవా చేశారు.

టీడీపీ హయంలో 90-95శాతం ఉన్న ఉత్తీర్ణత.. ఇప్పుడు 67శాతానికి పడిపోయిందని రాష్ట్రంలో పాఠశాల విద్యా వ్యవస్థ దుస్థితికి ఈ ఫలితాలే నిదర్శనమన్నారు. . 2 లక్షల మందికి పైగా విద్యార్ధులు ఓ విద్యా సంవతర్సాన్ని.. కోల్పోయే పరిస్థితికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు చంద్రబాబు. ఇక్కడ ఫెయిల్‌ అయింది విద్యార్ధులు కాదని.. ప్రభుత్వ వ్యవస్థలేనన్నారు చంద్రబాబు.పరీక్షల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ లేకపోవడం, వారికి బోధనేతర పనులు అప్పగించడం, బడుల విలీనం సహా ప్రభుత్వం తీసుకున్న పలు అస్తవ్యవస్త విధానాల వల్లే.. విద్యార్ధులు తీవ్రంగా నష్టపోయారన్నారు చంద్రబాబు.

Tags

Read MoreRead Less
Next Story