తంబళ్లపల్లి ఘటనపై డీజీపీకి చంద్రబాబు లేఖ

తంబళ్లపల్లి ఘటనపై డీజీపీకి చంద్రబాబు లేఖ

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎస్సీలపై దాడులను ప్రోత్సహిస్తున్నారంటూ ఆరోపించారు చంద్రబాబు. తంబళ్లపల్లి ఘటనపై డీజీపీకి లేఖ రాశారు. పుంగనూరు నియోజకవర్గంలో ఎస్సీలపై జరుగుతున్న దాడులు యాదృచ్చికం కావని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులలో ఓ వర్గం అధికార వైసీపీ నాయకులతో కుమ్మక్కై, వారి చెప్పుచేతల్లో పనిచేయడం దురదృష్టకరం అన్నారు. దాడికి పాల్పడిన వైసీపీ వారిని అదుపులోకి తీసుకోకుండా, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బాధిత టీడీపీ నాయకులను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం పూర్తిగా బ్రేక్ డౌన్ అయ్యే సమయం ఎంతో దూరంలో లేదని విమర్శించారు.

Tags

Next Story