AP: అన్వర్ అరెస్ట్ పై చంద్రబాబు ఆగ్రహం..

AP: అన్వర్ అరెస్ట్ పై చంద్రబాబు ఆగ్రహం..
టీడీపీ అధినేత చంద్రబాబు మాచర్లలో టీడీపీ కార్యకర్త అన్వర్ ను అరెస్ట్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు మాచర్లలో టీడీపీ కార్యకర్త అన్వర్ ను అరెస్ట్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా...లేక రాక్షస రాజ్యమా అని ప్రశ్నించారు.ఒక ముస్లిం సోదరుడిని బక్రీద్ పండుగ రోజు తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎప్పుడో ఎక్కడో జరిగిన వివాదంతో ముడిపెట్టి ఏకంగా హత్యాయత్నం కేసు పెట్టి పండుగ పూట జైలుకు పంపడంపై తీవ్రంగా మండిపడ్డారు. అన్వర్ బాషా అరెస్టు జగన్ రెడ్డి ఫాసిస్టు పాలనకు నిదర్శనమన్నారు. తండ్రిని పోలీసులు తీసుకువెళుతుంటే తల్లడిల్లుతున్న ఆ బిడ్డకు మీరు ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు.

బక్రీద్ నాడు అరెస్టుతో ఒక ముస్లిం కుటుంబాన్ని క్షోభకు గురి చేసిన పాపం పోలీసులను, కుట్ర చేసిన వైసీపీ నేతలను వెంటాడుతుందన్నారు. ముస్లిం సమాజం మీ చర్యను గమనిస్తోందని మీకు గట్టిగా బుద్దిచెపుతుందన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, అన్వర్‌ బాషా అరెస్ట్ ను ఖండించారు‌. ముస్లిం మైనారిటీల‌పై త‌న సైకోయిజాన్ని జగన్‌ రెడ్డి మ‌రోసారి ప్రద‌ర్శించారంటూ ఫైర్‌ అయ్యారు. త్యాగానికి ప్రతీక అయిన బ‌క్రీద్ పండ‌గ రోజు క‌క్ష క‌ట్టి మ‌రీ అన్వర్ ని అరెస్టు చేశారంటూ మండిపడ్డారు. బ‌క్రీద్ జ‌రుపుకోకుండా అన్వర్‌ని అరెస్టు చేయించి, కుటుంబానికి పండ‌గ పూట క‌న్నీరు మిగిల్చిన సైకో సీఎం దీనిపై స‌మాధానం చెప్పాలన్నారు.

Tags

Next Story