AP : చంద్రబాబు ప్రమాణ స్వీకారం ముహూర్తం ఫిక్స్?

AP : చంద్రబాబు ప్రమాణ స్వీకారం ముహూర్తం ఫిక్స్?
X

ఈ నెల 12న మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. ప్రమాణ స్వీకార వేదిక కోసం అమరావతిలోని పలు ప్రాంతాలను టీడీపీ నేతలు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే రాయపూడిలో ప్రమాణ స్వీకార ఏర్పాట్ల కోసం 50 లారీల్లో సామాగ్రి సిద్ధం చేశారు. అటు ఇద్దరు ఏఎస్పీల ఆధ్వర్యంలో ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటివద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

వాస్తవానికి చంద్రబాబు నాయుడు ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని తొలుత భావించారు. అయితే ఆరోజు ప్రధానిగా మూడోసారి మోదీ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆ కార్యక్రమానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతగా చంద్రబాబు హాజరు కావాల్సి ఉంది. అందుకే తన ప్రమాణస్వీకారాన్ని మరో మూడు రోజులు వాయిదా వేసుకున్నారని చెబుతున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి మోదీతో పాటు ఎన్డీఏ ముఖ్యనేతలు హాజరయ్యే అవకాశముంది.

ఇదిలా ఉంటే.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరి.. మధ్యాహ్నానికి హస్తినకు చేరుకున్నారు. సాయంత్రం జరిగే ఎన్డీఏ సమావేశంలో ఇద్దరునేతలు పాల్గొంటున్నారు. ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే ఎన్డీఏలో ఉన్నామని చంద్రబాబు ప్రకటించగా.. . తన ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ సహా ఢిల్లీ పెద్దలను ఆయన ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.

Tags

Next Story