AP : మంగళగిరిలో బాబు.. సీఎం అంటూ నినాదాలు

AP : మంగళగిరిలో బాబు.. సీఎం అంటూ నినాదాలు
X

టీడీపీ అధినేత చంద్రబాబు రాకతో మంగళగిరిలోని ఎన్టీఆర్‌ భవన్‌లో సందడి నెలకొంది. పోలింగ్‌ ముగిశాక తొలిసారి పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు నేతలు ఘన స్వాగతం పలికారు. ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఒక్కసారిగా సీఎం సీఎం నినాదాలతో ఎన్టీఆర్‌ భవన్‌ మార్మోగిపోయింది. సంబరాలు రేపు చేసుకుందామని.. శక్తిని అప్పుడే ఖర్చు చేసుకోవద్దంటూ శ్రేణులతో చంద్రబాబు చమత్కరించారు. ఈ సందర్భంగా పార్టీ బ్యాకాఫీస్‌లో పనిచేసిన నేతలను చంద్రబాబు అభినందించారు.

ప్రపంచ సైకిల్‌ దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ట్విటర్‌లో తాను సైకిల్‌ తొక్కుతున్న ఫొటోను పంచుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. టీడీపీ గుర్తు కూడా సైకిల్‌ కావడంతో.. సైక్లింగ్‌ వ్యక్తులకు, సమాజానికి మంచిదని అన్నారు.

Tags

Next Story