జగన్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారు : చినరాజప్ప

తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గుంటూరు జైల్ భరో కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. అమరావతి రైతులకు మద్దతుగా జైల్ భరో చేపడితే... అక్రమ అరెస్టులు చేస్తున్నారని మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్థరాత్రి నుంచే టీడీపీ నాయకులను, కార్యకర్తలను హౌస్ అరెస్ట్ చేసి, ప్రతిపక్షం గొంతు నొక్కాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అవలంభిస్తున్న అప్రజాస్వామిక విధానాలను ప్రజలు గమనిస్తున్నారని... త్వరలో ప్రజలే జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
Next Story