AP : చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి స్టేట్ గెస్ట్‌గా చిరంజీవి

AP : చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి స్టేట్ గెస్ట్‌గా చిరంజీవి
X

ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి స్టేట్ గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి రానున్నారు. ఇవాళ సాయంత్రానికే ఆయన విజయవాడ చేరుకుని అక్కడే బస చేయనున్నారు. కాగా ఇప్పటివరకు ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ హాజరవుతారని వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.

చంద్రబాబు కేబినెట్‌లో జనసేనాని పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఖరారైనట్లు తెలుస్తోంది. ఆయన గౌరవం తగ్గకుండా మరెవరికీ ఈ పోస్టు ఇవ్వటం లేదని సమాచారం. ఆయన ఒక్కరికే ఈ పదవి కట్టబెట్టనున్నట్లు టాక్. 2014లో టీడీపీ హయాంలో ఇద్దరు, 2019లో వైసీపీ హయాంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలుగా కొనసాగారు. అటు టీడీపీకి 19, జనసేనకు 3, బీజేపీకి 2 మంత్రి పదవులు దక్కే అవకాశముంది.

జనసేన శాసనసభ పక్ష నేతగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో శాసనసభ పక్ష సమావేశం జరిగింది. తొలుత పవన్ పేరును ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించగా మిగతా సభ్యులందరూ ఆమోదించారు.

Tags

Next Story