Anna Canteens : అన్న క్యాంటీన్లు ప్రారంభించిన సీఎం చంద్రబాబు దంపతులు
కృష్ణా జిల్లా గుడివాడలో అన్న క్యాంటీన్‌ను సీఎం చంద్రబాబు దంపతులు ప్రారంభించారు. స్వయంగా పేదలకు అన్నం వడ్డించారు. అనంతరం అక్కడ వసతులను పరిశీలించి తాము కూడా ఆహారాన్ని రుచి చూశారు. రేపటి నుంచి మరో 99 క్యాంటీన్‌లను ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులు ఆరంభించనున్నారు. రూ.5కే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి డిన్నర్ అందజేస్తారు. దివంగత ఎన్టీఆర్ అడుగుజాడల్లో తమ ప్రభుత్వం పయనిస్తోందని సీఎం చంద్రబాబు చెప్పారు. ‘మాది పేదల ప్రభుత్వం. ఆర్థిక కష్టాలున్నప్పటికీ సామాజిక పింఛన్లు పెంచి అందిస్తున్నాం. పేదల ఆకలి తీర్చేందుకు నేటి నుంచి 100 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమానికి విరాళాలు ఇచ్చి ప్రజలు భాగస్వాములు కావాలి. పుట్టినరోజు, పెళ్లి రోజు, శుభకార్యాల రోజున విరాళాలు ఇస్తే మీ పేరున భోజనం పెడతాం’ అని తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com