AP CM : నేడు అమరావతికి చంద్రబాబు

AP CM : నేడు అమరావతికి చంద్రబాబు
X

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ( CM Chandrababu Naidu ) నేడు అమరావతిలో ( Amaravathi ) పర్యటించనున్నారు. ఉండవల్లి ప్రజావేదిక నుంచి ఆయన పర్యటన ప్రారంభం కానుంది. తర్వాత అమరావతి రాజధానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో పర్యటిస్తారు. అక్కడి నుంచి సీడ్‌ యాక్సెస్‌ రోడ్, అసంపూర్తిగా మిగిలిన అఖిల భారత సర్వీసు అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాల్ని పరిశీలిస్తారు. అధికారుల భవన సముదాయాలను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతారు.

ఇప్పటికే సీఆర్డీఏ అధికారులు రాజధాని ప్రాంతంలో పెరిగిన ముళ్లకంపలను తొలగించి చదును చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు. శుభ్రం చేసి ముఖ్యమంత్రి పర్యటనకు సిద్ధంగా ఉంచారు.

సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఈ నెల 25, 26వ తేదీల్లో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు బుధవారం తెలిపాయి. మొదట 23, 24 తేదీల్లో పర్యటన ఉంటుందని భావించారు. అయితే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో 25వ తేదీన చంద్రబాబు పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు ధ్రువీకరించాయి.

Tags

Next Story