CM Chandrababu : చిన్నారికి నామకరణం చేసిన సీఎం చంద్రబాబు

CM Chandrababu : చిన్నారికి నామకరణం చేసిన సీఎం చంద్రబాబు
X

చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు ( CM Chandrababu Naidu ) పర్యటనలో ఆసక్తికర ఘటన జరిగింది. R&B గెస్ట్ హౌస్‌లో ప్రజల నుంచి సీఎం వినతులు స్వీకరిస్తుండగా.. శాంతిపురం మండలానికి చెందిన సుధాకర్, ప్రియ దంపతులు తమ రెండో కుమార్తెకు నామకరణం చేయాలని చంద్రబాబును కోరారు. ముద్దులొలికే చిన్నారిని చేతుల్లోకి తీసుకున్న బాబు ‘చరణి’ అని పేరు పెట్టారు. తమ బిడ్డకు సాక్ష్యాత్తూ సీఎం పేరు పెట్టడంతో తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

సింపుల్ గవర్నమెంట్.. ఎఫెక్టివ్ గవర్నెన్స్ తమ విధానమని సీఎం చంద్రబాబు అన్నారు. వైసీపీ పాలకులకు కూటమి ప్రభుత్వానికి చాలా తేడా ఉంటుందని చెప్పారు. కుప్పం అభివృద్ధికి సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని నియోజకవర్గ పర్యటనలో అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలకు అధికారులు వేగంగా స్పందిస్తూ ఎఫెక్టివ్‌గా పనిచేయాలని సూచించారు. నెల రోజుల వ్యవధిలో మార్పు చూపించాలన్నారు.

Tags

Next Story