AP : సీఎస్ పదవీకాలాన్ని పొడిగించాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ( Neerab Kumar Prasad ) పదవీకాలాన్ని మరో 6 నెలలు పొడిగించాలని సీఎం చంద్రబాబు ( CM Chandrababu Naidu ) కేంద్రానికి లేఖ రాశారు. నీరభ్ పదవీకాలం జూన్ 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన సర్వీసును మరో 6 నెలల పాటు పొడిగించాలని సీఎం కేంద్రప్రభుత్వాన్ని కోరారు. తొలుత 3 నెలల పాటు సర్వీస్ పొడిగింపు లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నీరభ్ కుమార్ ప్రసాద్ సీనియార్టీ ప్రకారం సీఎస్ కావాల్సి ఉంది.. కానీ గత ప్రభుత్వ హయాంలో జవహర్‌రెడ్డిని సీఎస్‌గా నియమించారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ సలహాదారుగా ఎం.వెంకటేశ్వరరావును నియమించారు. ఈ మేరకు సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.. గతంలో పోలవరం చీఫ్ ఇంజినీరుగానూ, రాష్ట్ర జలవనరులశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్‌గానూ బాధ్యతలు నిర్వహించారు. పోలవరంలో తొలి నుంచి పని చేసిన అనుభవం ఆయనకు ఉండటంతో ఈ బాధ్యతలు అప్పగించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com