AP CM Birthday Wishes to His Wife : భువనేశ్వరి నా సర్వస్వం.. సీఎం చంద్రబాబు బర్త్ డే విషెస్

సీఎం చంద్రబాబు ( CM Chandrababu Naidu ) సతీమణి భువనేశ్వరి ( Bhuvaneshwari ) నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆమెకు బర్త్ డే విషెస్ తెలుపుతూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
'ప్రజా సేవకు అంకితమైన నాకు ఎల్లవేళలా అండగా నిలిచావు. కష్ట సమయాల్లోనూ చిరునవ్వు చెదరకుండా ధైర్యంగా నాకు తోడుగా ఉన్నావు. హ్యాపీ బర్త్ డే భువనేశ్వరి. నా సర్వస్వం' అని పోస్ట్ చేశారు.
నేడు రాష్ట్ర సచివాలయంలో 8మంది మంత్రులు తమ బాధ్యతల్ని స్వీకరించనున్నారు. కార్మిక మంత్రిగా వాసంశెట్టి సుభాష్, జలవనరుల మంత్రిగా నిమ్మల రామానాయుడు, పరిశ్రమల మంత్రిగా టీజీ భరత్, దేవాదాయశాఖ మంత్రిగా ఆనం రాంనారాయణ రెడ్డి, బీసీ సంక్షేమ మంత్రిగా సవిత, ఎంఎస్ఎంఈ మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్, రెవెన్యూ మంత్రిగా అనగాని సత్యప్రసాద్, సినిమాటోగ్రఫీ మంత్రిగా కందుల దుర్గేశ్ బాధ్యతల్ని చేపట్టనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com