AP : లండన్ నుంచి జగన్ దంపతులు తిరిగొచ్చేది అప్పుడే!
ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు పూర్తి కావడంతో.. వైసీపీ చీఫ్, సీఎం జగన్ రిలాక్స్ అవుతున్నాయి. ఎలక్షన్ ముగిసిన నాలుగు రోజుల తర్వాత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సమేతంగా శుక్రవారం రాత్రి విదేశీ పర్యటనకు బయలుదేరారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు మంత్రులు జోగి రమేష్, కొట్టు సత్యనారాయణ, ఎంపీ నందిగామ సురేష్, ప్రభుత్వ విప్‌లు సీహెచ్. భాస్కర్ రెడ్డి, ఎస్.ఉదయభాను, ఎమ్మెల్సీలు టి.రఘురామ్, ఎం.అరుణ్ కుమార్, ఎమ్మెల్యే ఎం.విష్ణు సెండ్‌ఆఫ్ ఇచ్చారు.
సీఎం జగన్ వరుసగా రెండో సారి అధికారం చేపట్టాలనుకుంటున్నారు. ఇటీవల ఐప్యాక్ట్ టీమ్‌ని కలిసిన సీఎం జగన్.. ఈ సారి జరిగిన ఎన్నికల్లో గెలిచేది మనమే అంటూ ధీమా వ్యక్తం చేశారు.
వైస్ జగన్ పిటీషన్‌ను అనుసరించి సిబిఐ కేసుల ప్రత్యేక కోర్టు తన కుటుంబ సభ్యులతో కలిసి మే 17 నుండి జూన్ 1 వరకు యుకెలో పర్యటించడానికి మంగళవారం అనుమతి మంజూరు చేసింది. జూన్ 4న ఓట్ల లెక్కింపునకు మూడు రోజుల ముందు జూన్ 1న ఆయన ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి రానున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com