AP : నేటి నుంచి సీఎం జగన్ విదేశీ పర్యటన

AP : నేటి నుంచి సీఎం జగన్ విదేశీ పర్యటన

ఏపీ సీఎం జగన్ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం విదేశాలకు వెళ్లనున్నారు.ఈరోజు రాత్రి 11 గంటలకు విజయవాడ నుంచి బయల్దేరి తొలుత లండన్ వెళ్తారు. జూన్ 1 వరకు ఆయన లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్‌లో పర్యటిస్తారు. జగన్ విదేశీ పర్యటనకు ఇటీవల నాంపల్లి సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది,

జగన్‌ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కోరిన న విషయం తెలిసిందే. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు సీఎం జగన్‌ విదేశీ పర్యటనకు ఈ నెల 17 నుంచి జూన్‌ 1 వరకు అనుమతిస్తూ ఆదేశాలిచ్చింది. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు జరగనుండటంతో అప్పటివరకు జగన్‌ పర్యటన ముగించుకొని భారత్‌కు తిరిగి రానున్నారు.

Tags

Next Story