AP : ఎన్నికల్లో ఎక్కడ నుంచైనా పోటీకి సిద్ధం : అలీ

రాబోయే ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నానని సినీ నటుడు, వైసీపీ నేత అలీ (Ali) స్పష్టం చేశారు. రాజమండ్రిలో నిర్వహి స్తున్న క్రికెట్ టోర్నమెంట్ (Cricket Tournament) ప్రారంభోత్సవంలో ఎంపీ మార్గాని భరత్ తో కలిసి అలీ పాల్గొన్నారు. తాను ఎక్కడ నుంచి పోటీ అనేది ఇంకా తేలలేదని, సీఎంవో నుంచి కబురు వస్తుందన్నారు. ఈ వారంలో కబురు వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చని, ఎవరైనా పోటీ చేయవచ్చని, అయితే సినిమా వేరు, రాజకీయాలు వేరని చెప్పారు. తాను ఎక్కడ నుంచైనా పోటీకి సిద్ధంగా ఉన్నానన్నారు. గతంలో అనేక మంది సినీ ప్రముఖులు పోటీ చేశారని, శారద, జమున, కృష్ణంరాజు, మురళీ మోహన్ వంటి సినీ ప్రముఖులు పోటీ చేశారని ఆలీ గుర్తు చేశారు.
తనకేమీ ప్రత్యేక స్థానం అంటూ లేదని, మంచి అభ్యర్థి అయితే ఎక్కడైనా గెలుస్తాడు. న్నారు. పొత్తులేమైనా ఓటర్లు నొక్కే బటన్ లపై ఆధారపడి ఫలితాలుంటాయని తెలిపారు. మేము సిద్ధం అంటున్నాం. వారూ సిద్దం అంటున్నారు ఫలితాలు ఎలా వస్తాయో అప్పుడు చూద్దాం అంటూ ఆలీ సమాధానమిచ్చారు. సినీ నటుడు అలీ గత ఎన్నికల్లోనూ ఏపీలో టికెట్ కోసం ప్రయత్నించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com