AP : ఏపీలో రేషన్ పంపిణీ షురూ

వాలంటీర్ల ప్రమేయం లేకుండా ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డుదారులకు నిత్యావసర సరుకుల పంపిణీ మొదలైంది. మునుపటిలాగే మొబైల్ డిస్పర్సింగ్ యూనిట్(ఎండీయూ) ఆపరేటర్లు రేషన్‌బియ్యం, పంచదార, గోధుమపిండిని నిర్దేశిత ధరలతో కార్డుదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేస్తున్నారు. బుధవారం ఉదయం 7 గంటలకు ఈ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది.
విటమిన్ బీ12, ఐరన్ కలిపిన పోషకవిలువలతో కూడిన బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. గోధుమపిండిని కేజీకి రూ.16కే ఇస్తున్నారు. రేషన్ బియ్యాన్ని అనధికారికంగా కొనడం కానీ, అమ్మడం కానీ చేసే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటారని అధికారులు హెచ్చ రించారు. నిత్యావసరాల పంపిణీలో ఫిర్యాదులు ఉంటే టోల్‌ఫ్రీ నెంబర్ 1967కు ఫోన్ చేయాలని కోరారు.
వాలంటీర్ల స్థానంలో వీఆర్‌వోలు రేషన్ పంపిణీలో పాల్గొంటున్నారు. రేషన్ పంపిణీ సమయంలో ఎక్కడైనా బయోమెట్రిక్ విషయంలో ఇబ్బందులు తలెత్తితే వీఆర్వోలు వాటిని సరి చేయాలని అధికారులు సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com