AP : విశాఖ అరకు MP ఎన్నికల ఫలితాలపై సందిగ్ధత

AP : విశాఖ అరకు MP ఎన్నికల ఫలితాలపై సందిగ్ధత

విశాఖ అరకు MP ఎన్నికల ఫలితాలపై సందిగ్ధత నెలకొంది. 7వేల 509 ఓట్లు గల్లంతైనట్టు రిటర్నింగ్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేశారు BJP అభ్యర్థి గీత. ఓట్ల లెక్కింపుపై క్లారిటీ ఇవ్వాలని ఎన్నికల అధికారిని గీత ఆశ్రయించారు. 11లక్షల 45 వేల 426 ఓట్లు పోలైనట్టు గతంలో EC తెలిపారని గీత అన్నారు.

ఐతే... కౌంటింగ్ దగ్గరకు వచ్చే సరికి 11,37,917 ఓట్లను మాత్రమే లెక్కించారని అభ్యంతరం వ్యక్తం చేశారు గీత. వెంటనే ఎన్నికల కమీషన్ దీనిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ లోక్ సభ సెగ్మెంట్ లోని ఓట్లను రీ కౌంటింగ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేశారు.

Tags

Next Story