Srisailam : శ్రీశైలంలో కానిస్టేబుల్ సూసైడ్

Srisailam : శ్రీశైలంలో కానిస్టేబుల్ సూసైడ్
X

శ్రీశైలం వన్‌టౌన్ పోలీస్‌ స్టేషన్‌ కు చెందిన కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి 2001 వ సంవత్సరం బ్యాచ్‌కు చెందిన శివశంకర్‌రెడ్డిగా పోలీసులు తెలిపారు.కానిస్టేబుల్ శివశంకర్ రెడ్డి స్వగ్రామం కర్నూలు అని అధికారులు తెలిపారు.

ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న సిఐ ప్రసాద్‌రావు ఘటనా స్థలాన్ని పరిశీలించి శివశంకర్‌రెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని తెలియజేశారు. ఘటనకు సంబంధించి వివరాల కోసం మీడియాకు అనుమతిని నిరాకరించారు.

డీఎస్పి శ్రీనివాసరావు శ్రీశైలం చేరుకున్న తరువాత మీడియాను అనుమతిస్తామని సిఐ ప్రసాదరావు తెలిపారు.

Tags

Next Story