AP : ద్వారంపూడిపై క్రిమినల్ చర్యలు తప్పవు.. మంత్రి నాదెండ్ల హెచ్చరిక

"కాకినాడ పోర్టును ఒక అడ్డాగా మార్చుకుని ఒక కుటుంబానికి లబ్ధి చేకూరేలా మార్చేశారు. ఒక్క ద్వారంపూడి కుటుంబానికి లబ్ధి చేకూరింది. ఎవ్వరు తప్పు చేసినా క్రిమినల్ కేసులు పెడతాం..." అని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు.
పౌర సరఫరాల శాఖలో 36 వేల కోట్లు అప్పు చేశారన్నారు నాదెండ్ల. రైతులకు 16 వందల కోట్లు బాకీలను మిగిల్చారన్నారు. చిత్తూరు నుండి కాకినాడ వరకు వ్యవస్థీకృత మోసాలు జరిగాయని చెప్పారు. కాకినాడ జిల్లాలో పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్ సంబంధిత అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ షన్మోహన్, ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
గత ప్రభుత్వంలో కౌలు రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని.. వారికి న్యాయం చేసే దిశగా ఆలోచనలు చేయాలన్నారు మంత్రి మనోహర్. ఈ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ పొరపాటు జరగకుండా చూసుకుంటామన్నారు. రేషన్ పంపిణీ విషయంలో కొన్ని లోపాలు ఉన్నాయని, వాటిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ హాస్టల్, అంగన్ వాడీ సెంటర్లకు సరుకులు ఏ విధంగా సరఫరా అవుతున్నాయని మంత్రి నాదెండ్ల అడిగి తెలుసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com