AP : ఏపీకి తప్పిన తుఫాను ముప్పు!

బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాను వల్ల ఏపీకి ఎటువంటి ముప్పు లేదని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అల్పపీడనం రేపటికి వాయుగుండంగా, ఎల్లుండి తూర్పుమధ్య బంగాళాఖాతం వద్ద తుఫానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. మే 26 సాయంత్రానికి బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్ తీరాలకు తీవ్ర తుఫానుగా చేరుకుంటుందని వెల్లడించింది. ప్రస్తుతానికి దీని వల్ల ఏపీకి ఎటువంటి ముప్పులేదని ట్వీట్ చేసింది.
ఇవాళ మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. శని, ఆదివారాల్లోనూ కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. మరోవైపు రేపు 33 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమేపి తుఫాన్‌గా మారనుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ తుఫాన్ ఆదివారం సాయంత్రం కల్లా పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతాలను తాకనున్నట్లు IMD తెలిపింది. తీరాన్ని తాకే సమయంలో 102 KMPH వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. వర్షాకాలం ప్రారంభానికి ముందు బంగాళాఖాతంలో ఏర్పడనున్న తొలి తుఫాన్ ఇదే కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com