AP : ఏపీకి తుఫాన్ ముప్పు.. ఈ జిల్లాల్లో హై అలర్ట్

AP : ఏపీకి తుఫాన్ ముప్పు.. ఈ జిల్లాల్లో హై అలర్ట్

ఐఎండి సూచనల ప్రకారం బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడిందని శుక్రవారానికి వాయు గుండంగా, ఎల్లుండి తూర్పుమధ్య బంగాళాఖాతం వద్ద తుఫానుగా మారే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. ఆదివారం సాయంత్రానికి బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ తీరాలకు తీవ్ర తుఫానుగా చేరుకుంటుందని ప్రస్తుతానికి దీని వలన ఏపీకు ఏటువంటి ముప్పులేదని తెలిపారు.

శని, ఆదివారాల్లో చెదురుమదురుగా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదన్నారు. మే 24, శుక్రవారం.. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

శ్రీకాకుళం, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

Tags

Next Story