AP Municipal Elections: ఒంగోలులోని దర్శి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం..

AP Municipal Elections: దర్శి మున్సిపల్ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించింది టీడీపీ. మొత్తం 20 వార్డుల్లో 13 వార్డులు టీడీపీ గెలుచుకోగా, వైసీపీ ఏడు స్థానాలు గెలుచుకుంది. టీడీపీ గెలుపుతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఫలితాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీపై ప్రజల్లో ఎంత ఆగ్రహం ఉందో ఈ ఎన్నికలు నిరూపించాయి. వైసీపీపై ప్రజల్లో అసంతృప్తి తారాస్థాయికి పెరిగిందనడానికి దర్శిలో టీడీపీ విజయమే నిదర్శనం.
నిజానికి దర్శి నియోజకవర్గంలో టీడీపీకి సరైన నాయకత్వమే లేదు. ఉద్దండులైన నేతలంతా వైసీపీ పక్షంలోనే ఉన్నారు. అయినా సరే, దర్శి ప్రజలంతా టీడీపీకే ఓటేశారు. దర్శిలో టీడీపీ శ్రేణులు సైతం బాగా పోరాడారు. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు.. వైసీపీ విజయం కోసం చేయని ప్రయత్నాలు లేవు.
మద్దిశెట్టి వేణుగోపాల్ కోడ్ ఉల్లంఘించి మరీ ఓటర్లను ప్రలోభపెట్టారన్న ఆరోపణలున్నాయి. చివరికి, మద్దిశెట్టి వేణుగోపాల్‌పై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని టీడీపీ చెబుతోంది. పైగా దర్శి మున్సిపాలిటిని కైవసం చేసుకునేందుకు వైసీపీ నేతలు భారీ ఎత్తున డబ్బులు వెదజల్లారని బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. కాని, టీడీపీ మాత్రం అరకొర నిధులతోనే వైసీపీని ఢీకొట్టి.. ఏకంగా దర్శి మున్సిపాలిటీని కైవసం చేసుకుని సత్తా చాటింది టీడీపీ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com