TTD : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 12 గంటల టైమ్

Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సర్వదర్శన మార్గాన స్వామి వారిని దర్శించుకునే భక్తులకు బుధవారం ఉదయం 8 గంటల సమయానికి కనీసం 12 గంటల సమయం పడుతోంది. మంగళవారం శ్రీవారిని 63,421 మంది దర్శించుకున్నారు. వారిలో కనీసం 19,644 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. వివిధ రూపాలలో స్వామి వారి హుండీ ఆదాయం కనీసం రూ.4.84 కోట్లుగా ఉంది. స్వామి దర్శనం కోసం 11 కంపార్టుమెంట్లో భక్తులు వేచి ఉన్నారు.
తిరుమలకు మరోసారి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. స్వామివారి హుండీకి ఆదివారం ఒక్కరోజే కాసుల వర్షం కురిసింది. ఒక్క ఆదివారం నాడే శ్రీవారి హుండీ ఆదాయం రూ.5కోట్ల మార్కును చేరుకుంది. శ్రీవారి హుండీకి ఆదివారం రూ.5.09 కోట్లు ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వివరించింది.
కాగా టీటీడీలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు తిరుమల ఎంప్లాయీస్ క్యాంటీన్‌లో అల్పాహారం, భోజనం అందించడానికి టీటీడీ చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఇక మీదట రాయితీ ధరతో వీరికి కూడా టిఫిన్, భోజనం, టీ, కాఫీ అందిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com