Women's Safety App : ఉమెన్ సేఫ్టీ యాప్‌గా మారిన దిశ యాప్

Womens Safety App : ఉమెన్ సేఫ్టీ యాప్‌గా మారిన దిశ యాప్
X

మహిళల భద్రతకు జగన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దిశ యాప్ పేరును చంద్రబాబు ప్రభుత్వం ఉమెన్ సేఫ్టీ యాప్ గా మార్చింది. ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. గత ప్రభుత్వం మహిళా రక్షణ పేరుతో.. మీ భద్రతే మా బాధ్యత అంటూ 2020 ఫిబ్రవరిలో దిశ యాప్ ను ప్రారంభించింది.

దీనిని ఇప్పటి వరకు 50 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. గతంలో యువతులు, మహిళల ఫోన్లలో ఈ యాప్ ని పోలీసులు డౌన్ లోడ్ చేయించారు. యువతులు, మహిళలు ఆపదలో ఉంటే ఈ యాప్ లోని ఫీచర్లు పోలీసులు, కుటుంబసభ్యులకు తక్షణమే సమాచారాన్ని అందిస్తాయి. దీనికి మరింత ప్రాచుర్యం కల్పించి మహిళలకు అండగా ఉండాలని టీడీపీ కూటమి సర్కారు భావిస్తోంది.

Tags

Next Story