ఇది జగనన్న ప్రభుత్వం కాదు.. జలగన్న ప్రభుత్వం: దివ్యవాణి

ఇది జగనన్న ప్రభుత్వం కాదు.. జలగన్న ప్రభుత్వం: దివ్యవాణి
జగన్ ప్రభుత్వం అమ్మ ఒడి పేరుతో ఇచ్చి ట్యాక్సుల పేరుతో వసూలు చేస్తోందని ఆరోపించారు దివ్యవాణి

అమ్మ ఒడి పేరుతో సంవత్సరానికి 14వేలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం.. ట్యాక్సుల పేరుతో జనం నుంచి నెలకు 14వేలు వసూలు చేస్తోందని ఆరోపించారు టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి. కరోనా కాలంలో కనీసం నివారణా చర్యలు చేపట్టలేదని విమర్శించారు.

రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని నీరుగార్చారని మండిపడ్డారు.. ఒకప్పుడు ఉచితంగా లభించే ఇసుకను ఇప్పుడు బంగారంలా మార్చారని దివ్యవాణి విమర్శించారు.. ఇది జగనన్న ప్రభుత్వం కాదని, జలగన్న ప్రభుత్వమని ప్రజలే అంటున్నారని దివ్యవాణి చెప్పుకొచ్చారు.


Tags

Next Story