AP : నేడు 8మంది మంత్రుల బాధ్యతల స్వీకరణ

నేడు రాష్ట్ర సచివాలయంలో 8మంది మంత్రులు తమ బాధ్యతల్ని స్వీకరించనున్నారు. కార్మిక మంత్రిగా వాసంశెట్టి సుభాష్, జలవనరుల మంత్రిగా నిమ్మల రామానాయుడు, పరిశ్రమల మంత్రిగా టీజీ భరత్, దేవాదాయశాఖ మంత్రిగా ఆనం రాంనారాయణ రెడ్డి, బీసీ సంక్షేమ మంత్రిగా సవిత, ఎంఎస్ఎంఈ మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్, రెవెన్యూ మంత్రిగా అనగాని సత్యప్రసాద్, సినిమాటోగ్రఫీ మంత్రిగా కందుల దుర్గేశ్ బాధ్యతల్ని చేపట్టనున్నారు.
ఉదయం 7 30 గంటలకి మంత్రి వాసంశెట్టి సుభాష్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత ఉదయం 9 గంటలకు ఐటీ మంత్రిగా టీజీ భరత్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక, ఉదయం 9.30కి మంత్రి నిమ్మల రామానాయుడు బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే, ఉదయం 10.30కి గొల్లపల్లి దేవదాయ కమిషనర్ కార్యాలయంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు.
ఉదయం 10.35 గంటలకు మంత్రి సవిత పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఉదయం 11.15 గంటలకు మంత్రి అనగాని సత్యప్రసాద్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే, సాయంత్రం 5 గంటలకు మంత్రి కందుల దుర్గేష్ బాధ్యతలను చేపట్టనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com