Telugu States : రేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎన్నికల నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. ఏపీలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణలో 17 లోక్‌సభ, ఒక అసెంబ్లీ(ఉపఎన్నిక) స్థానంలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచి ఈ నెల 25 వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 26న నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది. 29న ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అదేరోజున అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు.
ఏపీ, తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్
ఎన్నికల నోటిఫికేషన్ జారీ - ఏప్రిల్ 18
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం - ఏప్రిల్ 18
నామినేషన్లు దాఖలుకు తుది గడువు - ఏప్రిల్ 25
నామినేషన్ల పరిశీలన - ఏప్రిల్ 26
నామినేషన్ల ఉప సంహరణ - ఏప్రిల్ 29
ఏపీ, తెలంగాణలో ఎన్నికలు - మే 13
ఓట్ల లెక్కింపు, విజేతల ప్రకటన - జూన్ 4
మొత్తం 7 దశలలో దేశంలోని అన్ని లోక్‌సభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. మార్చి 16న సీఈసీ రాజీవ్ కుమార్ సార్వత్రిక ఎన్నికలు 2024 షెడ్యూల్ విడుదల చేయగా.. దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని విధాలుగా ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్ జరగనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com