AP : ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగలేదు: కేఏ పాల్

దేశంలో ఎన్నికల వ్యవస్థపై నమ్మకం పోతోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ ఇంతటి దారుణ పరిస్థితులు చూడలేదన్నారు. ఈవీఎంలు పగలగొడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ముఖ్యంగా విశాఖలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగలేదని చెప్పారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద కూడా సెక్యూరిటీపై తనకు అనుమానాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో ఎలక్షన్ కమిషన్ విఫలమైందని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. ఈవీఎం, వీవీప్యాట్ ధ్వంసం చేయడం వైసీపీ అరాచకానికి పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. ఎలక్షన్ కౌంటింగ్ వరకు పిన్నెల్లిని అరెస్టు చేయవద్దంటే అర్థం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇంత దరిద్రపుగొట్టు ఎలక్షన్స్ దేశ చరిత్రలో ఎక్కడా జరగలేదని అసహనం వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com