CM Chandrababu : విమానంలో వచ్చినా చెట్లను నరికేవారు: చంద్రబాబు

గత పాలకులు రాష్ట్రాన్ని పూర్తిగా ధ్వంసం చేసి వెళ్లారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. తమ ప్రభుత్వం సుపరిపాలనతో దూసుకెళ్తోందని చెప్పారు. తణుకులో జరిగిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘గత సీఎం జగన్ ఎప్పుడూ ప్రజల్లో తిరగలేదు. ఒక వేళ వచ్చినా పరదాలు కట్టుకుని తిరిగేవారు. విమానంలో వచ్చినా కింద చెట్లను కొట్టేసేవారు. ప్రజా సమస్యలపై ఎప్పుడూ మాట్లాడనిచ్చేవారు కాదు’ అని పేర్కొన్నారు. తన జీవితం ప్రజల కోసం అంకితమని తణుకు పర్యటనలో సీఎం చంద్రబాబు తెలిపారు. ‘41 ఏళ్లుగా అసెంబ్లీకి వెళ్తున్నాను. పదేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేశాను. నా జీవితమంతా అలుపెరుగని పోరాటమే. నా చివరి రక్తపు బొట్టు వరకు మీకు సేవ చేయాలనేదే నా సంకల్పం. ఇప్పటి వరకు చేసినదానికి రెట్టింపు పనిని వచ్చే 5, 10 ఏళ్లలో చేస్తాను. వచ్చే 22 ఏళ్లలో మన రాష్ట్రాన్ని దేశంలో నంబర్ వన్‌గా చేస్తాను’ అని వ్యాఖ్యానించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com