Anantha ZP Meeting : అనంత జెడ్పీ మీటింగ్ లో రసాభాస

X
By - Manikanta |1 Feb 2025 11:30 AM IST
అనంతపురం జెడ్పీ సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశంలో టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వాట్సాప్ గవర్నెన్స్ అంశంపై టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా ఇరుపక్షాలు ఆగ్రహంతో ఊగిపోయాయి. జెడ్పీ సర్వసభ్య సమావేశంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. నిధుల మంజూరు, అభివృద్ధి విషయంలో గత వైసీపీ పాలనలో ఏం జరిగిందని అధికారపక్షం ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ సమావేశం జరగకుండా వైసీపీ జెడ్పీటీసీలు అడ్డుపడుతున్నారని మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. హక్కుల గురించి మాట్లాడే అర్హత వైసీపీ జెడ్పీటీసీలకు లేదని మండిపడ్డారు. దాంతో సభలో రచ్చ జరిగింది.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com