Weather : మండుతున్న ఎండలు.. గుడ్‌న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ

ఎండలతో అల్లాడుతోన్న ప్రజలకు ఊరట కలగనుంది. ద్రోణి ప్రభావంతో రేపు ఏలూరు, NTR, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, YSR, అన్నమయ్య, తిరుపతి, అల్లూరి, మన్యం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మరోవైపు తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. మే 15 తర్వాత ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ప్రకటించింది. రానున్న నాలుగు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. ఆ తర్వాత కూడా ఇదే వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com